మేన కోడలితో కొత్త జీన్స్ లాంచ్ చేయించిన సల్మాన్.. పిక్స్ వైరల్

by Disha Web Desk 7 |
మేన కోడలితో కొత్త జీన్స్ లాంచ్ చేయించిన సల్మాన్.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ నుంచి మ‌రో క‌లెక్షన్‌ లాంచ్ చేశాడు. 2007లో బీయింగ్ హ్యూమన్ క్లాతింగ్ స్టోర్ స్థాపించిన ఆయన.. ఈ సంస్థ ద్వారా పేద విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేప‌డుతున్నారు. అయితే తాజాగా ఈ బ్రాండ్ నుంచి ఉమెన్ జీన్స్‌ కొత్త కలెక్షన్ విడుద‌ల చేస్తున్నట్లు సల్మాన్‌ ఖాన్ సోష‌ల్ మీడియాలో ప్రక‌టించగా.. తన మేనకోడలు అలిజే అగ్నిహోత్రితో లాంచ్ చేయించడం విశేషం. కాగా ఈ పిక్స్ నెట్టింట షేర్ చేస్తూ.. ‘మన ప్రేమ ఆప్యాయతలు మ‌న జీన్స్‌లోనే ఉన్నాయి. మ‌నం మ‌న‌లాగా ఉంటున్నాం అంతే’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.



Next Story