ఎన్టీఆర్ పేరు‌ని ఫుల్‌గా వాడేస్తున్న సల్మాన్ ఖాన్

by Disha Web Desk 10 |
ఎన్టీఆర్ పేరు‌ని ఫుల్‌గా వాడేస్తున్న సల్మాన్ ఖాన్
X

దిశ, సినిమా: అడుగున పడిపోయిందనుకున్న బాలీవుడ్‌ను ఈ ఏడాది షారుఖ్ ఖాన్ పూర్తిగా లేపాడు. మొదట ‘పఠాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని వెయ్యి కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన బాద్ షా.. రీసెంట్‌గా ‘జవాన్’తో మరోసారి వెయ్యి కోట్ల మార్క్‌ని అందుకున్నాడు. ఇక బాలీవుడ్‌‌లో మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రేంజ్ మాత్రం .. కరోనా పీరియడ్ తర్వాత బాగా తగ్గిపోయింది. సక్సెస్ అందుకుని చాలా కాలం అవుతున్న ఆయన.. ‘టైగర్ 3’ తో రాబోతున్నాడు. ఈ మూవీ నవంబర్ 12న విడుదల కాబోతుంది.

దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలెట్టారు మేకర్స్. అయితే షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ బుకింగ్స్ చూస్తే అసలు ఇది నిజంగా సల్మాన్ ఖాన్ సినిమానేనా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ అంత దారుణంగా ఉన్నాయి. పైగా ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, అలాగే హృతిక్ రోషన్ కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు అని తెలిసిన ఎవరూ పట్టించుకోవట్లేదు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలతో పాటుగా మన టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా క్లైమాక్స్‌లో కలిపించబోతున్నట్టు తెలుస్తుంది. దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ ఈ న్యూస్ వైరల్ అవుతుంది. కనీసం తారక్ ఉన్నాడని తెలిస్తేనైనా బుకింగ్స్ వస్తాయని, సల్లూ భాయ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పేరును సోషల్ మీడియాలో తెగ వాడేస్తున్నారు. మరి ఎన్టీఆర్ వల్ల సౌత్‌లో అయిన ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ పెరుగుతాయో లేదో చూడాలి.



Next Story

Most Viewed