బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌కు మందు తాగి వచ్చి హోస్ట్ చేసిన సల్మాన్ ఖాన్.. హాట్ టాపిక్‌గా మారిన వీడియో

by Mallepaka Hamsa |

బిగ్‌బాస్ షో ప్రేక్షకుల ఆదరణ పొందుతూ అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతూ భారీ వ్యూస్ రాబట్టుకుంటోంది

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌కు మందు తాగి వచ్చి హోస్ట్ చేసిన సల్మాన్ ఖాన్.. హాట్ టాపిక్‌గా మారిన వీడియో
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ షో ప్రేక్షకుల ఆదరణ పొందుతూ అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతూ భారీ వ్యూస్ రాబట్టుకుంటోంది. ఇక తెలుగులో సీజన్-9 కొనసాగుతుండగా.. హిందీలో బిగ్’బాస్ సీజన్ 19(Bigg Boss Season 19) ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ షోకు ఎప్పటినుంచో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తన హోస్టింగ్‌తో మరింత క్రేజ్ తీసుకువస్తున్నాడు. ఈ సీజన్‌కు కూడా ఆయన హోస్ట్‌గా వ్యవరిస్తుండటం విశేషం. ఇక వీకెండ్ ఎపిసోడ్‌లో సల్మాన్ ప్రవర్తన కొంచెం భిన్నంగా ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ముఖ్యంగా అతని ముఖం బాగా ఉబ్బిపోయినట్లు కనిపించింది. కళ్లు కూడా వాచిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. ఇక ఈ వీడియోలు చూసిన వారంతా షాక్ అవుతూ.. సల్మాన్ ఖాన్ తాగి వచ్చి షో చేశాడని పలు విమర్శలు చేస్తున్నారు. కానీ ఆయన అభిమానులు మాత్రం సల్మాన్ బిజీ షెడ్యూల్ వల్ల సరిగ్గా నిద్ర లేకపోవడంతో ముఖం అలా ఉందని సపోర్ట్‌‌గా నిలుస్తున్నారు. నిద్ర లేకపోవడం వల్ల అతను సరిగ్గా నిలబడలేకపోయాడు కూడా. ఈ క్రమంలోనే కొంతమంది సల్మాన్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని అభిమానులు చెబుతున్నారు. అయినప్పటికీ కొందరు సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

link

Next Story