బిగ్ షాకిచ్చిన సల్మాన్ ఖాన్.. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరు మార్పు.. కొత్త టైటిల్ ఇదేనంటూ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-16 09:31:22  IST  )

బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా వార్ డ్రామా టైటిల్ మార్పుతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

బిగ్ షాకిచ్చిన సల్మాన్ ఖాన్.. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరు మార్పు.. కొత్త టైటిల్ ఇదేనంటూ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా వార్ డ్రామా టైటిల్ మార్పుతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో 'బ్యాటిల్ ఆఫ్ గాల్వన్' అని పిలిచిన ఈ చిత్రానికి ఇప్పుడు ‘మాతృభూమి’ (Maatrubhoomi) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. సల్మాన్ స్వయంగా కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ అందరికీ షాకిచ్చారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో సల్మాన్ ఖాన్ రక్తం కారుతున్న గాయాలతో, ఒంటి నిండా రక్తంతో చాలా సీరియస్‌గా కనిపిస్తున్నారు. శత్రువులు తనపై దాడి చేయకుండా ముళ్ళ కంచె చుట్టిన ఒక స్తంభాన్ని గట్టిగా అడ్డుకుంటున్న దృశ్యం ఆకట్టుకుంటోంది. "యుద్ధం శాంతిగా విశ్రమించనివ్వండి" అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను ఆయన పోస్ట్ చేశారు. అయితే, గతంలో ఏప్రిల్ 10న విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్, తాజా పోస్టర్‌లో మాత్రం విడుదల తేదీ కనిపించకపోవడం గమనార్హం. దీంతో అది చూసిన నెటిజన్లు సల్మాన్ అభిమానులు అయోమయంలో పడిపోయారు.

అసలు ఈ టైటిల్ చేంజ్ చేయడానికి గల కారణాలేంటా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పదం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఏప్రిల్‌లో విడుదల కాదని తెలుసుకున్న వారంతా కాస్త షాక్ అవుతున్నారు. 2020లో జరిగిన గాల్వన్ సరిహద్దు ఘర్షణల ఆధారంగా అపూర్వ లఖియా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై చైనా ప్రభుత్వ మీడియా 'గ్లోబల్ టైమ్స్' ఇప్పటికే అసహనం వ్యక్తం చేసింది. ఇది నిజాలను వక్రీకరిస్తోందని, చైనాకు వ్యతిరేక భావజాలాన్ని పెంచుతోందని విమర్శించిన విషయం తెలిసిందే. ఇక విడుదల సమయంలో ఇబ్బందులు పడటం ఎందుకని ముందుగానే.. చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ సరసన చిత్రంగద సింగ్ నటిస్తోంది. దేశం కోసం భారత సైనికులు చేసిన త్యాగాలను, ధైర్యసాహసాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు.

Next Story