సమంత పై మనసు పడ్డ సల్మాన్ ఖాన్..అసలు ఏం జరిగింది అంటే..

by Dishafeatures1 |
సమంత పై మనసు పడ్డ సల్మాన్ ఖాన్..అసలు ఏం జరిగింది అంటే..
X

దిశ, సినిమా: ప్రజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ త్రిష కి.. ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. సల్మాన్ ఖాన్ హీరోగా, తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ కాంబోలో ‘ది బుల్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం 1988 ఆపరేషన్ కాక్టస్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందట. ఇందులో ఫరోక్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తుండగా, అతని భార్య పాత్రలో త్రిష నటిస్తున్నట్టు ఒక వార్త బయటకు వచ్చింది. అంతే కాదు ఇందులో త్రిష పాత్రకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

కానీ తాజా సమాచారం ప్రకారం త్రిష ఆశలపై అగ్ర దర్శకుడు నీళ్లు చల్లాడు. ‘ది బుల్’ మూవీలో ఆమె స్థానంలో మరో స్టార్ హీరోయిన్‌ను తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అందుతున్నా సమాచారం ప్రకారం.. తొలుత ఈ సినిమాకు కూడా పనిచేయాలని త్రిష కి డేట్స్ ఇచ్చారు. కానీ అజిత్, చిరంజీవి సినిమాలతో పాటు ‘ది బుల్’ మూవీ క్లాష్ కావడంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయారట. దాంతో ఆమెను తప్పించి ఆమె ప్లేస్‌లో స్టార్ హీరోయిన్ సమంతను తీసుకొన్నట్టు సమాచారం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.



Next Story

Most Viewed