సల్మాన్ హత్యకు కుట్ర.. యూకే నుంచి మెడికల్ స్టూడెంట్ ప్లాన్

by Disha Web Desk 10 |
సల్మాన్ హత్యకు కుట్ర.. యూకే నుంచి మెడికల్ స్టూడెంట్ ప్లాన్
X

దిశ, సినిమా : సల్మాన్ ఖాన్‌ను హత్య బెదిరింపులకు గురిచేసిన వ్యక్తిని ముంబై పోలీసులు గుర్తించారు. ఇమెయిల్-రిపోర్టుల ప్రకారం బ్రిటన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఇండియాకు చెందిన హర్యానా వాసిగా వెల్లడించిన పోలీసులు.. సదరు విద్యార్థిపై లుకౌట్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ఇక గతేడాది మార్చిలో గ్యాంగ్ స్టర్ ‘గోల్డీ బ్రార్’ పేరిట సల్మాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపు ఇమెయిల్ సందేశాలు పంపిన యువకుడిని చట్టపరమైన ప్రక్రియ ద్వారా ఇండియాకు రప్పించే ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘మూడవ సంవత్సరం మెడికల్ చదువుతున్న సదరు వ్యక్తి అకడమిక్ సెషన్ ముగిసిన తర్వాత ఈ ఏడాది చివరి నాటికి భారతదేశానికి తిరిగి వస్తాడు’ అని పోలీసులు చెప్పినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

Also Read..

ఒంటరిగా కనిపిస్తే చంపేస్తాం.. ‘ది కేరళ స్టోరీ’ నటీనటులకు హెచ్చరిక

Next Story

Most Viewed