Salaar Teaser : ‘సలార్’ టీజర్ మారింది.. ఇది గమనించారా?

by Disha Web Desk 7 |
Salaar Teaser : ‘సలార్’ టీజర్ మారింది.. ఇది గమనించారా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సలార్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే మొత్తంగా ఈ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. తాజాగాఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో అప్డేట్ చేయడం విశేషం. పాత టీజర్‌కు కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి కొత్త టీజర్ తీసుకొచ్చారు. ఇక పాత టీజర్‌తో కొత్త టీజర్ చూసుకుంటే.. కొత్త టీజర్‌లో కలర్స్ కొన్ని షేడ్స్ లైట్‌గా మారింది. ఇక పాత టీజర్‌లో ఓ చోట ఓ విలన్ తెల్లటి గుర్రంపైకి ఎక్కి యుద్ధ నాదం చేస్తాడు. ఆ సీన్ స్థానంలో గన్స్ పట్టుకొని కొందరు వ్యక్తులు వరుసగా నడుచుకుంటూ వచ్చారు. దీంతో ఈ మార్పును చూసి కొందరు అభిమానులు ‘టీజర్ చూస్తుంటే చాలా వరకు ‘కేజీఎఫ్’ సిరీస్ గుర్తోస్తుంది. ప్రశాంత్ నీల్ మార్క్ ఇందులో కనిపిస్తుంది’ అంటూ ట్వీట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ‘నీల్ తన మొదటి చిత్రం ‘ఉగ్రమ్’ను మార్పులు చేసి తీసుకొచ్చాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed