సలార్ సెంకడ్ పార్ట్ టైటిల్ రివీల్

by Disha Web Desk 4 |
సలార్ సెంకడ్ పార్ట్ టైటిల్ రివీల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి ప్రభాస్ నుంచి పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ మూవీ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఎట్టకేలకు డార్లింగ్ ఫ్యాన్స్ ఆశ ‘సలార్- ది సీస్ ఫైర్’ సినిమా ద్వారా నెరవేరింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ నీల్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్‌తో వసూళ్లలో దూసుకెళ్తుంది. ఫస్ట్ డే రూ.175 కోట్లు వసూలు చేసి ఇండియా సినిమా చరిత్రలో తొలిరోజు అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. అయితే తొలి భాగానికి ‘సలార్ - ది సీజ్ ఫైర్’ అని టైటిల్ ఫిక్స్ చేసిన టీమ్.. సెకండ్ పార్ట్ పేరును సినిమా అయి పోయిన తర్వాత థియేటర్‌లో రివీల్ చేసింది. ‘సలార్ - శౌర్యాంగ పర్వం’ అని సెకండ్ పార్ట్ పేరును అనౌన్స్ చేసింది. దీంతో ఫస్ట్ పార్ట్ విషయంలో ఫుల్ జోష్‌లో ఉన్న ఫ్యాన్స్ సెకండ్ పార్ట్ దద్దరిల్లిపోతుందని ధీమాగా ఉన్నారు.



Next Story