- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘శాకుంతలం’ ప్రీమియర్ షో.. పక్కా హిట్ అంటున్న ప్రముఖులు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషించిన తాజా చిత్రం ‘శాకుంతలం’.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోలు వేయడం ప్రారంభించారు మేకర్స్. దిల్ రాజు తన స్ట్రాటజీ ఉపయోగించి పలు చోట్ల శాకుంతలం 3D మూవీ ప్రదర్శించారు. అయితే ఈ ప్రివ్యూ షో చూసిన ఆడియన్స్ ఈ సినిమాపై పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ‘మూవీలో సమంత చాలా నేచురల్‌గా నటించింది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంది’ అలాగే ‘ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ చాలా బాగుంది’ అనే టాక్ ఎక్కువ వినబడుతుంది. ఇక ‘కడుపుతో ఉన్నప్పుడు శకుంతల బాధపడిన సీన్స్, ఆమె పడిన కష్టాలు ఈ సినిమాలో హైలెట్ సన్నివేశాలు’ అని అంటున్నారు.
Next Story






