ఆమెకోసం స్టార్ హీరో కొడుకును పక్కకు నెట్టేసిన విలేఖర్లు.. వీడియో వైరల్

by Disha Web Desk 6 |
ఆమెకోసం స్టార్ హీరో కొడుకును పక్కకు నెట్టేసిన విలేఖర్లు.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌ ఫొటోగ్రాఫర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన సోదరి సారా అలీఖాన్ నటించిన ‘జరా హట్కే జరా బచ్చే’ ఇటీవల విదులైన సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ చూడటానికి తాజాగా సారాతో కలిసి థియేటర్ వెళ్లాడు. అయితే షో అనంతరం బయటకు వస్తున్నపుడు వీరిద్దరినీ చుట్టుముట్టిన విలేఖర్లు సారా ఫొటోల కోసం ఇంబ్రహీంను లెక్కచేయకుండా పక్కను నెట్టేశారు. దీంతో వాళ్లపై ఫైర్ అయిన ఇబ్రహీం.. ‘మాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి. ఎందుకిలా మీదపడుతున్నారు. దూరంగా వెళ్లి ఫొటో తీసుకోండి. దగ్గరకు రావొద్దు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Also Read: కొండచిలువతో బాలీవుడ్ హీరోయిన్ ఫొటో షూట్.. పోస్ట్ వైరల్



Next Story

Most Viewed