మామ కోసం అల్లుడు మొక్కులు.. కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న సాయిధరమ్ తేజ్!

by Jakkula Samataha |   (  Updated:2024-06-15 09:23:41  IST  )

మెగా హీరో సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయనకు తన మామయ్య పవన్, చిరంజీవిలంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే కాకుండా, తనకు ఈ హీరో వీరాభిమాని. ఇక ఏపీ ఎన్నికల్లో

మామ కోసం అల్లుడు మొక్కులు.. కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న సాయిధరమ్ తేజ్!
X

దిశ, సినిమా : మెగా హీరో సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయనకు తన మామయ్య పవన్, చిరంజీవిలంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే కాకుండా, తనకు ఈ హీరో వీరాభిమాని. ఇక ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపుకోసం సాయిధరమ్ తేజ్ ఎంతో కష్టపడ్డారు. ప్రచారంలో పాల్గొని తన మామయ్యను గెలిపించాలని, ఓటర్లను వేడుకున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ పవన్‌కు సపోర్ట్ చేస్తూ పోస్టుల పెట్టిన విషయం తెలిసిందే. అలాగే వపన్ గెలిచారని తెలియడంతో ఆయన ఆనందం మాటల్లో చెప్పలేకపోయారు. పవన్ కళ్యాణ్‌ను ఎత్తుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అయితే తాజాగా మెగా హీరో తిరుమలను సందర్శించారు. ఈరోజు (శనివారం) ఉదయం తిరుపతికి చేరుకొని కాలినడకన శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిస్తే సాయిధరమ్ తేజ్ కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటాను అని మొక్కుకున్న ట్లు తెలుస్తోంది. ఆ కోరిక తీరడంతో.. ఆయన నిన్న హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. తర్వాత రాత్రి తిరుపతిలో బస చేసి, తెల్లవారుజామున అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన కొండపైకి చేరుకుని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో మెగా హీరో పై పవన్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టమా అంటూ షాక్ అవుతున్నారు.

Next Story