తమిళ నటుడితో సాయి పల్లవి పెళ్లి.. విరాట పర్వం డైరెక్టర్ పోస్ట్ వైరల్

by Disha Web Desk 7 |
తమిళ నటుడితో సాయి పల్లవి పెళ్లి.. విరాట పర్వం డైరెక్టర్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయిపల్లవి. మొదటి సినిమాతో తెలుగింటి ఆడపడుచుగా మంచి పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు.. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. కథలో పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు ఒప్పుకునే సాయి పల్లవి.. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్, తెలుగులో నాగచైతన్యతో మూవీస్ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. సాయిపల్లవికి పెళ్లి అయిపోయిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. సాయిపల్లవితో పాటు మరో వ్యక్తి దండలతో ఉన్న ఈ ఫొటోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నిజంగానే ఆమెకు పెళ్లి అయిపోయిందా అంటూ చాలా మంది అయోమయానికి గురవుతున్నారు. అయితే.. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ వేణు ఊడుగుల. ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్‌లో ‘తమిళ నటుడు శివకార్తికేయన్ కొత్త మూవీ పూజ సందర్భంగా తీసుకున్న ఫొటో ఇది’ అని పోస్ట్ చేశారు. దీంతో సాయిపల్లవి పెళ్లిపై క్లారిటీ వచ్చింది అందరికీ.

Next Story