Sai Pallavi : భారీ బడ్జెట్ మూవీతో రానున్న సాయి పల్లవి

by Disha Web Desk 17 |
Sai Pallavi : భారీ బడ్జెట్ మూవీతో రానున్న సాయి పల్లవి
X

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంటెంట్‌, క్యారెక్టర్‌ల ప్రయార్టీని బట్టి ఆమె తన ప్రాజెక్ట్‌ను ఎంచుకుంటుంది. ఈ కారణంగానే ఆమె ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తమిళ చిత్రం 'గార్గి' మూవీ తర్వాత సాయి పల్లవి నుంచి మరో అప్డేట్ ప్రాజెక్ట్ రాలేదు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కూడా సైలెంట్ అయ్యింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ రెండు భారీ ప్రాజెక్టు‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ తన 50వ సినిమా‌లో సాయి పల్లవి‌ని ఎంపిక చేసుకున్నట్లు టాక్. ఈ మూవీని రూ.100 కోట్ల బడ్జెట్‏తో సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. దీంతో పాటుగా తమిళ్ స్టార్ అజిత్, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ సినిమాలోని ఓ కీలకమైన పాత్రలో సాయి పల్లవి కనిపించనుందట. అయితే ఈ రెండు వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Also Read...

బరువు పెరగకుండా ఉండేందుకు తన సీక్రెట్ చెప్పిన హీరోయిన్..


Next Story

Most Viewed