నా సక్సెస్‌ సీక్రెట్ అదే.. మీరు ఫాలో అవ్వండి : Sai Pallavi

by Disha Web Desk 10 |
నా సక్సెస్‌ సీక్రెట్ అదే.. మీరు ఫాలో అవ్వండి : Sai Pallavi
X

దిశ, సినిమా: మనం చేసే పనిలో ఆనందాన్ని వెతుకున్నపుడే జీవితం సంతోషంగా ఉంటుందని చెప్తోంది సాయిపల్లవి. అంతేకాదు ప్రొఫెషనల్ వర్క్‌ అనేది ఎప్పుడూ వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపించకుండా ఉండాలంటోంది. తాజాగా ఓ సమావేశంలో మాట్లాడిన నటి.. ‘పని సంతోషంగా ఉంటేనే జీవితం సంతృప్తిగా ఉంటుంది. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని వేరు వేరుగా చూస్తేనే మనసుకు ప్రశాంతత. నేను పొద్దంతా ఏ పనిచేసినా సాయంత్రం ఇంటికి రాగానే దాని గురించి మరిచిపోతా. మళ్లీ మూవీ సెట్‌లోకి అడుగుపెట్టగానే పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించడం మానేస్తా. షూటింగ్‌లో ఉన్నంతసేపు పాత్రలోనే లీనమైపోతా. సందర్భానికి తగ్గట్లుగా ఆయా పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఏకాగ్రతతో పనిచేస్తా. ఈ క్రమంలోనే మంచి రిజల్ట్ వచ్చేలా చూసుకుంటా. అందరూ ఇది పాటిస్తే చాలు లోకం ఆనందమయమే’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed