తమిళ నటుడితో సాయి పల్లవి పెళ్లి.. ఎమోషనల్ అయిపోయిన నటి

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-09-26 07:31:42  IST  )

ఓ తమిళ నటుడితో సాయి పల్లవి పెళ్లి జరిగిందని, ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అయింది.

తమిళ నటుడితో సాయి పల్లవి పెళ్లి.. ఎమోషనల్ అయిపోయిన నటి
X

దిశ, సినిమా : ఓ తమిళ నటుడితో సాయి పల్లవి పెళ్లి జరిగిందని, ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అయింది. కానీ అది ఓ సినిమా పూజా సెరమనీకి సంబంధించినదని.. దాన్ని కావాలనే కట్ చేసి ఈ విధంగా సర్క్యులేట్ చేశారని డైరెక్టర్ వేణు ఊడుగుల క్లారిటీ ఇచ్చాడు. అయితే దీనిపై తాజాగా స్పందించిన బ్యూటీ.. ‘నేను రూమర్స్ పట్టించుకోను. కానీ కుటుంబసభ్యుల్లాంటి స్నేహితులతో ముడిపడి ఉన్నప్పుడు మాట్లాడాలి. నా సినిమా పూజా కార్యక్రమం నుంచి ఒక ఫొటోను ఉద్దేశపూర్వకంగా కట్ చేసి, అసహ్యకరమైన ఉద్దేశంతో సర్క్యులేట్ చేశారు. నా వర్క్ ఫ్రంట్‌ గురించి హ్యాపీ అనౌన్స్‌మెంట్స్ ఉన్నప్పుడు.. ఇలాంటి వాటి గురించి వివరించడం నిరుత్సాహపరిచింది. ఇలా అసౌకర్యం కలిగించడం నీచమైన చర్య’ అని ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. బేఫిటింగ్ రిప్లయ్ ఇచ్చిందని అంటున్నారు అభిమానులు.

Next Story