ఆయనే నాకు స్ఫూర్తి.. సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Dishanational2 |
ఆయనే నాకు స్ఫూర్తి.. సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: దివంగత స్టార్ నిర్మాత, ఏసియ‌న్ గ్రూప్ ఛైర్మన్‌ నారాయ‌ణ్ దాస్ కే నారంగ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంది సాయిపల్లవి. ఫైనాన్సింగ్, డిస్ట్రిబ్యూష‌న్, ప్రొడక్షన్‌ వంటి రంగాల్లో తనదైన ముద్ర వేసి తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటానని ఈ సందర్భంగా ఆమె వెల్లడించింది. ఈ మేరకు ‘లవ్‌స్టోరీ’ సినిమా ఈవెంట్‌ సందర్భంగా నారాయణ్‌ దాస్‌ నారంగ్‌తో దిగిన త్రో బ్యాక్‌ స్టిల్‌ను షేర్ చేసిన నటి.. ‘ప్రియమైన నారాయ‌ణ్ దాస్ నారంగ్‌కు సినిమా పట్ల ఉన్న అభిరుచి, ప్రేమ నాపై చాలా ప్రభావం చూపించాయి. ధన్యవాదాలు సార్’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సాయిపల్లవి చిరునవ్వులు చిందిస్తూ ఆయనతో కలిసి దిగిన ఫొటో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. శ్రీ వెంక‌టేశ్వర్ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీలో బ్యానర్‌లో నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’కి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించగా ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

Read More: స్టార్ హీరో ధనుష్ బర్త్ డే.. ఫుల్ మాస్ యాక్షన్స్‌తో ‘Captain Miller’ టీజర్ రిలీజ్



Next Story

Most Viewed