- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రముఖి-2 రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.. ఎందుకో తెలుసా..?
కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ తాజా సినిమా ‘చంద్రముఖి-2’.

దిశ, వెబ్‌డెస్క్: కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ తాజా సినిమా ‘చంద్రముఖి-2’. రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సిక్వెల్‌గా రూపొందిన ఈ మూవీ.. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని సెప్టెంబర్-15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో చంద్రముఖి రోల్ కంగనా రనౌత్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కంగనా కంటే ముందు ఈ రోల్ కోసం సాయి పల్లవిని సంప్రదించారట డైరెక్టర్ పి. వాసు. కానీ, ఆమె ఈ అవకాశాన్ని తిరస్కరించారట.
ఈ పాత్ర నర్తకికి సంబంధించినది కాబట్టి సాయిపల్లవిని అడిగారట. ఆమె నో చెప్పేసరికి సెకండ్ హైయెస్ట్ ఛాయిస్‌గా కంగనాను తీసుకున్నరట. సాయి పల్లవి మొదటి నుంచి కూడా తాను ఎంచుకున్న పాత్ర న్యాయం చేయగలను అనుకున్న వాటికే ఓకే చేస్తుంది. ఈ క్రమంలో ఆమె ఒప్పుకున్న సినిమాల కంటే రిజెక్ట్ చేసినవే ఎక్కువగా ఉంటాయి. మరి చంద్రముఖి పాత్రకు ఎందుకు నో చెప్పిందో తెలియరాలేదు. కాగా.. కంగనా కూడా చంద్రముఖి రోల్‌కు కరెక్ట్‌గా సెట్ అయింది. సాయి పల్లవి అయితే ఈ మూవీ వేరే లెవల్‌లో ఉండేది అంటున్నారు నెటిజన్లు.






