ఇండియాలో సాయిపల్లవి తోపు.. ధోని, విజయ్ కూడా పనికిరారు ?

by velandi.Saikiran |

స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి ( Sai Pallavi ) ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. సాయి

ఇండియాలో సాయిపల్లవి తోపు.. ధోని, విజయ్ కూడా పనికిరారు ?
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి ( Sai Pallavi ) ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. సాయి పల్లవి.. ఏ సినిమా చేసినా కూడా.. బంపర్ హిట్ గ్యారెంటీ. తెలుగులో ఫిదా ( Fida) లాంటి సినిమాతో పాపులర్ అయిన సాయి పల్లవి... ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని (Ms Dhoni ), హీరో విజయ్ ( Vijay) లాంటి సెలబ్రిటీలను గజగజ వణికిస్తున్నారు. ఇండియాలోనే టాప్ మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్షియల్ సెలబ్రిటీగా సాయి పల్లవి నిలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


దేశవ్యాప్తంగా 25% మంది... ఇంస్టాగ్రామ్ లో సాయి పల్లవికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం జరుగుతోందని ప్రచారం సాగుతోంది. అంటే ఇండియా మొత్తంలో 20 శాతం మందిని సాయి పల్లవి ప్రభావితం చేస్తోందని తెలుస్తోంది. అలా... ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా ఇలాంటి అరుదైన ఘనత అందుకోలేదట. ఈ రికార్డు కేవలం సాయి పల్లవి సొంతం అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఆమె ఫ్యాన్స్. అయితే.. ఇదే ఇన్‌స్టాగ్రామ్‌ లో హీరో విజయ్ 20 శాతం జనాలను ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారట. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని... దేశవ్యాప్తంగా 17 శాతం మందిని ప్రభావితం చేస్తున్నట్లు పోస్టులు పెడుతున్నారు. ఇక మిగిలిన సెలబ్రిటీలలో... చాలా మంది ఐదు శాతం వరకు సోషల్ మీడియాలో జనాలను ప్రభావితం చేస్తున్నారట. ఈ లెక్క ప్రకారం సాయి పల్లవి... టాప్ లో ఉందని చెప్పవచ్చు.

Next Story