- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sai Pallavi : చరణ్‌తో జత కట్టబోతున్న సాయి పల్లవి
‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి.

దిశ, సినిమా: ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి.. అందం, నటనతో ఆకట్టుకుంది. టాలెంట్‌తో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. అందరు హీరోయిన్ల మాదిరిగా స్కిన్ షో చేయకుండా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఎన్ని అవకాశాలు వస్తున్నప్పటికీ.. హీరో, దర్శకుడు అనే ఎలిమెంట్స్ కాకుండా కథలో తన పాత్ర గురించి ఆలోచిస్తుంది. కచ్చితంగా హిట్ అందుకుంటుంది. అందుకే ఆమె సినిమా చేస్తుందంటే అంచనాలు పెరిగిపోతుంటాయి.
ఇక చాలా గ్యాప్ తర్వాత ఎట్టకేలకు ఒక తెలుగు సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది ఈ ముద్దుగుమ్మ. యంగ్ హీరో నాగ చైతన్యతో రెండో సారి జత కట్టబోతుంది. అయితే తాజాగా రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్‌గా నటింపజేయాలనే చర్చలు జరుగుతున్నాయట. చరణ్‌కు జోడిగా బాలీవుడ్ హాట్ బ్యూటీతో బుచ్చిబాబు చర్చలు జరపగా, ఆమె దాదాపుగా ఓకే చెప్పినట్లు.. సాయి పల్లవిని మరో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు టాక్ వినపడుతుంది. కానీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
- Tags
- Sai Pallavi






