జపాన్ ‘సపోరో స్నో ఫెస్టివల్’కు సాయిపల్లవి.. ఎందుకో తెలుసా?

by Disha Web Desk 7 |
జపాన్ ‘సపోరో స్నో ఫెస్టివల్’కు సాయిపల్లవి.. ఎందుకో తెలుసా?
X

దిశ, సినిమా: స్టార్ నటి సాయిపల్లవి నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్‌ కొడుకు జునైద్ ఖాన్ ప్రాజెక్ట్‌లో సాయి ప‌ల్లవి హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. కాగా బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఆ మూవీకి సునీల్‌పాండే దర్శకత్వం వహిస్తున్నారు. అయితే యశ్‌రాజ్‌ ఫిలింస్ బ్యానర్‌లో వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం ప్రీ ప్రోడ‌క్షన్ ప‌నులు జ‌రుపుకుంటుడ‌గా షూటింగ్ సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మేరకు మూవీ షూటింగ్ జపాన్‌లో జ‌రుగ‌నున్నట్లు తెలుస్తుండగా అక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ‘సపోరో స్నో ఫెస్టివల్’ జ‌రుగుతుంది. ఈ ఫెస్టివల్‌ను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు జపాన్‌కు వస్తుంటారు. అయితే ఈ ఫెస్టివ‌ల్‌లోనే జునైద్, సాయిపల్లవిలపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed