- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sai Pallavi: కన్నీరు పెట్టుకున్న సాయి పల్లవి.. సరళ ఫ్యామిలీ భావోద్వేగం
Sai pallavi meets sarala family and gets emotional| వేణు ఊడుగుల దర్శకత్వంలో, దగ్గుబాటి రానా హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నక్సల్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తున్న సినిమా విరాటపర్వం.

దిశ, వెబ్‌డెస్క్: Sai pallavi meets sarala family and gets emotional| వేణు ఊడుగుల దర్శకత్వంలో, దగ్గుబాటి రానా హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నక్సల్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తున్న సినిమా విరాటపర్వం. నక్సల్స్ నేపథ్యంలో ప్రేమ, భావోద్వేగాలతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విరాటపర్వం పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం బిజీగా ఉంది. కాగా, విరాటపర్వం సినిమా నిజ జీవితంలో సరళ అనే ఓ అమ్మాయి పాత్ర నుంచి తీసుకొని రాసిన కథ అని డైరెక్టర్ గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా విరాటపర్వం టీమ్ సరళ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా సరళ తల్లి సాయి పల్లవిని చూసి భావోద్వేగానికి గురై తన కన్న కూతురే తన దగ్గరకు వచ్చినంత సంబరపడి పోయింది. ఈ సందర్భంగా సాయి పల్లవి కూడా సరళ కుటుంబ ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
- Tags
- Sai Pallavi






