అమీర్‌ఖాన్ కుమారుడితో అక్కడ ఎంజాయ్ చేస్తూ కనిపించిన సాయిపల్లవి..!

by Disha Web Desk 9 |
అమీర్‌ఖాన్ కుమారుడితో అక్కడ ఎంజాయ్ చేస్తూ కనిపించిన సాయిపల్లవి..!
X

దిశ, సినిమా: ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి జనాలందరినీ ఫిదా చేసింది టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ బ్యూటీకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ‘‘పడి పడి లేచే మనసు, ఎంసీఎ, కాళీ, మారి, ఎన్‌జీకె, విరాటపర్వం, ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్, మారి-2 దియా, లవ్ స్టోరీ’’ వంటి అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది.

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 లో నటిస్తుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అలాగే చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘తండేల్’ మూవీలో అక్కినేని హీరో నాగచైతన్య సరసన నటిస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

మరోవైపు నేచురల్ బ్యూటీ సాయిపల్లవి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్‌ తనయుడు జునైద్ ఖాన్ జంటగా నటిస్తోంది. ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జపాన్‌లో జరుగుతుంది. అయితే జపాన్ లో ప్రతి ఏటా ఫిబ్రవరిలో సపోరో స్నో పండుగ జరుగుతుంది. షూటింగ్‌లో కాస్త బ్రేక్ దొరికిన సమయంలో జునైద్ అండ్ సాయిపల్లవి ఈ ఫేస్టివల్‌ జరుపుకునే ప్లేస్ కు వెళ్లి ఎంజాయ్ చేశారు. వీరు స్నో ఫెస్టివల్‌లో సందడి చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో రకరకాలుగా స్పందిస్తున్నారు.Read Disha E-paper

Next Story

Most Viewed