- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దేవర’లో సాయి పల్లవి.. అతిధి పాత్రపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘దేవర’ సినిమా నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

దిశ, సినిమా: జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘దేవర’ సినిమా నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘దేవర’ అనే పదానికి దేవుడు అని అర్థం. కాగా ఈ యేడాది ఆరంభంలో రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైన మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, నరేన్, కలైయరసన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇటీవల సాయి పల్లవి కూడా అతిధి పాత్రలో కనిపించబోతున్నట్లు నెట్టింట పుకార్లు షికార్లు చేశాయి. దీంతో సాయి పల్లవి అభిమానులు నెట్టింట తెగ హల్ చల్ చేస్తుండగా దీనిపై క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.. సాయి పల్లవి నటిస్తుందనే వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఓ అభిమాని ప్రశ్నకు ‘నో’ అని ఆన్సర్ పెడుతూ ఇదంతా ఫేక్ న్యూస్ అని తేల్చేయగా ఆమె ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
Read More: నా కూతురు అలా తయారవడానికి కారణం నేనే.. సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్






