ఎట్టకేలకు మూడుముళ్లు వేయించుకున్న సాయి పల్లవి.. వరుడు తెలుగువాడే: వీడియో వైరల్

by Dishanational2 |
ఎట్టకేలకు మూడుముళ్లు వేయించుకున్న సాయి పల్లవి.. వరుడు తెలుగువాడే: వీడియో వైరల్
X

దిశ, సినిమా : స్టార్ నటి సాయి పల్లవి పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరం కాబోతుందని, దానికి కారణం మ్యారేజ్ అంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే అవన్నీ పుకార్లేనంటూ కొట్టిపారేసిన నటి.. ఆ తర్వాత తన సినిమా అప్‌డేట్‌లను ప్రకటించింది. ఇదిలావుంటే.. 2018లో ఏ.ఎల్ విజయ్ తెరకెక్కించిన తమిళ్, తెలుగు ద్విభాష చిత్రం ‘కణం’లో తెలుగు హీరో నాగ శౌర్య సరసన నటించింది సాయి పల్లవి. ఈ మూవీలో వీరిద్దరూ ఇష్టపడి పెళ్లిచేసుకోగా పెళ్లిమండపం నుంచి అత్తారింటికి రావడం, తన భార్య ఒంటరిగా దొరికితే ముద్దులుపెడదామనే కోరికతో నాగశౌర్య తిరగడం, ఆ తర్వాత ఆమెను హత్తుకోగానే ముసలి బామ్మల గుంపు చూసి నవ్వుకునే సన్నీవేశాలను చాలా సరదాగా చూపించాడు దర్శకుడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో మరోసారి నెట్టింట హల్ చల్ చేస్తుండగా నెటిజన్లు షాక్ అవుతున్నారు. సాయి పల్లవి సిగ్గు చూస్తే నిజమైన పెళ్లి వీడియోలాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More: మృణాల్‌ ఠాకూర్‌‌కు IFFM అవార్డు.. ఫుల్ ఖుష్ అవుతున్న నటి

Next Story

Most Viewed