సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ షూటింగ్ అప్డేట్.. పవర్ ఫుల్ పోస్టర్‌తో హైప్ పెంచిన మేకర్స్

by Mallepaka Hamsa |

మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంబరాల ఏటిగట్టు’(SambaralaYetiGattu).

సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ షూటింగ్ అప్డేట్.. పవర్ ఫుల్ పోస్టర్‌తో హైప్ పెంచిన మేకర్స్
X

దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంబరాల ఏటిగట్టు’(SambaralaYetiGattu). ఈ సినిమాకు రోహిత్ కె పి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో 18వ చిత్రంగా తెరకెక్కుతుండగా.. ఇందులో శ్రీకాంత్, అనన్య నాగళ్ల, జగపతి బాబు, సాయి కుమార్, కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) హీరోయిన్‌గా నటిస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతుంది.

ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘సంబరాల ఏటిగట్టు’ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. ‘‘సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో కీలకమైన, పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ షెడ్యూల్ కోసం చిత్రబృందం సిద్ధంగా ఉంది. ఇందులో సాయి ధరమ్ తేజ్‌తో పాటు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న శ్రీకాంత్ పాల్గొన్నబోతున్నారు. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతాయి’’ అని రాసుకొచ్చారు. అలాగే కొంతమంది శవాలై పడి ఉండగా.. సాయి ధరమ్ తేజ్ నడిచి వస్తుండగా.. వెనకాల మంటలు చెలరేగుతున్నట్లుగా ఉన్న పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.

link

Next Story