తారకరత్న ఆరోగ్యంపై.. Sai Dharam Teja ఎమోషనల్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2023-01-29 03:42:28  IST  )

నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొని యువ నటుడు నందమూరి తారకరత్న శుక్రవారం గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే..

తారకరత్న ఆరోగ్యంపై.. Sai Dharam Teja  ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొని యువ నటుడు నందమూరి తారకరత్న శుక్రవారం గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. అయితే శనివారం వైద్యులు తారకరత్న హెల్త్ బులిటెన్ ను కూడా విడుదల చేశారు. తారకరత్నం ఆరోగ్యం విషమంగా ఉందని, ప్రస్తుతం అతనికి ఎక్మో ద్వారా చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు. ఇక ఉన్నట్టుండి తారకరత్న గుండెపోటుకు గురికావడంతో సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా, మెగా హీరో సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా స్పందిచాడు. ''తారకరత్న అన్నా.. మీరు త్వరగా కోలువాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీరు ఆరోగ్యంగా దృఢంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను'' అంటూ రాసుకొచ్చాడు.

Next Story