సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ టీజర్ వాయిదా!

by Mallepaka Hamsa |

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమాతో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు..

సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ టీజర్ వాయిదా!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమాతో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు. దీనికి కార్తిక్ వర్మ దర్శకత్వం వహించగా.. కథానాయికగా సంయుక్తా మీనన్ నటిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 21న థియేటర్స్‌లోని రానుంది. అయితే విరూపాక్ష టీజర్‌ను చిత్రయూనిట్ మార్చి 1న విడుదల చేస్తునట్టు ప్రకటించారు.

కానీ, భీమవరంలో సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రావూరి పండు అనే వ్యక్తి మరణించాడు. దీంతో వీరూపాక్ష టీజర్‌ను వాయిదా వేస్తునట్టు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ‘‘మెగా ఫ్యాన్, సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్, భీమవరం రావూరి పాండు గారు అకాల మరణం గురించి విని షాక్ అయ్యాము. గౌరవ సూచకంగా ‘విరూపాక్ష’ టీజర్ విడుదల వాయిదా పడింది’’. అంటూ రాసుకొచ్చారు.

Next Story