‘బ్రో’ టైటిల్ వెనకున్న రహస్యం ఇదే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్

by Disha Web Desk 7 |
‘బ్రో’ టైటిల్ వెనకున్న రహస్యం ఇదే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘బ్రో’. తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (జూలై-25)న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సాయి ధరమ్ తేజ్ అయితే అసలు ఈ సినిమాకు ‘బ్రో’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు.. అలాగే ఈ సినిమాలో తనకు నచ్చిన కొన్ని సన్నివేశాలను పంచుకున్నారు.

సాయి తేజ్ మాట్లాడుతూ.. ‘‘ఈ మూవీ మొత్తం మామయ్య (పవన్ కల్యాణ్) ను బ్రో అని.. ఆయన నన్ను బ్రో అని పిలుస్తారు. అందుకే అదే పేరును టైటిల్‌గా ఫిక్స్ చేశారు. అంతే కాకుండా హీరోయిన్‌తో బ్రేకప్ తర్వాత మద్యం తాగి మామయ్యతో బాధను పంచుకునే సన్నివేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నిత్యం పరుగులు పెడుతూ బిజీ లైప్‌లో ఉండే ఓ వ్యక్తి యాక్సిడెంట్‌లో చనిపోతాడు. అయితే.. ఆ చనిపోయిన వ్యక్తికి మరికొన్ని రోజులు బతికే అవకాశం ఇస్తే అతడు ఏం చేస్తాడు అనేది ఈ సినిమా కథ’’ అంటూ చెప్పుకొచ్చారు.

Read Also..

భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలంటే.. ఈ సూత్రాలు పాటించాల్సిందే

వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ఏం జరుగుతుందో తెలుసా.. నిపుణులు ఏం అంటున్నారంటే..

Next Story

Most Viewed