సాయి ధరమ్ తేజ్ కారణంగా ‘బ్రో’ టీజర్ వాయిదా?

by Disha Web Desk 9 |
సాయి ధరమ్ తేజ్ కారణంగా ‘బ్రో’ టీజర్ వాయిదా?
X

దిశ, సినిమా: పవన్ కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘బ్రో’ ఒకటి. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. దర్శకుడు సముద్రఖని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ధరమ్ తేజ్ కారణంగా ఈ సినిమా టీజర్ ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. కారణం ఏమిటంటే పవన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి కాగా. ఇక సాయి ధరమ్ తేజ్ కొన్ని కీలక సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నాయి. వాటి చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో సాయి ధరమ్ తేజ్, మేనేజర్ సతీష్ మధ్య పెద్ద గొడవ జరిగిందట. మేనేజర్ సతీష్, సాయి ధరమ్ తేజ్‌తో గౌరవం లేకుండా ప్రవర్తించడంతో మాటామాటా పెరిగి సాయి ధరమ్ తేజ్ సతీష్ చెంప పగలగొట్టి షూటింగ్ స్పాట్ నుంచి గెంటేసినట్లు సమాచారం. కాగా ‘బ్రో’ కి సంబంధించిన ప్రొమోషన్స్ అన్నీ సతీష్ దగ్గరుండి చూసుకునేవాడు. ఇప్పుడు ఈ గొడవ కారణంగా టీజర్ వాయిదా పడిందట.

ఇవి కూడా చదవండి:

మహేష్ మూవీతో ‘అ’ సెంటిమెంట్ పక్కన పెట్టిన త్రివిక్రమ్.. మరి కలిసొస్తుందా?

Next Story