మహేష్ మూవీతో ‘అ’ సెంటిమెంట్ పక్కన పెట్టిన త్రివిక్రమ్.. మరి కలిసొస్తుందా?

by Disha Web Desk 9 |
మహేష్ మూవీతో ‘అ’ సెంటిమెంట్ పక్కన పెట్టిన త్రివిక్రమ్.. మరి కలిసొస్తుందా?
X

దిశ, సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ‘అ’ అక్షరం సెంటిమెంట్ అని తెలిసిందే. కానీ ఈ సెంటిమెంట్ దర్శకుడికి మొదటి నుంచి లేదు నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖలేజా, జులాయి లాంటి టైటిల్‌తో వచ్చిన మూవీస్ యావరేజ్ హిట్ అందుకోగా.. వీటి తర్వాత ‘అత్తారింటికి దారేది’ మూవీతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అ..ఆ.., అజ్ఙాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠపురములో అంటూ వరుసగా నాలుగు సినిమా టైటిళ్లు ‘అ’ తో పెట్టినప్పటికి హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మహేష్ మూవీ కోసం అతని సెంటిమెంట్‌ను కాస్త పక్కన పెట్టి ‘గుంటూరు కారం’ టైటిల్ ఫిక్స్ చేశారు త్రివిక్రమ్.

ఇవి కూడా చదవండి:

సాయి ధరమ్ తేజ్ కారణంగా ‘బ్రో’ టీజర్ వాయిదా?



Next Story