- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి చేసుకోబోతున్న సాయి ధరమ్ తేజ్.. అందుకే తిరుమలకు వచ్చానంటూ బిగ్ షాకిచ్చాడుగా!
టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిగా బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిగా బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇన్నాళ్లు చేసినట్లుగా కాకుండా అధికారికంగా ప్రకటించకుండానే సీక్రెట్‌గా పెళ్లి తంతును సైతం పూర్తి చేసుకుంటున్నారు. కొందరు మాత్రం పెళ్లి ప్రకటనతో సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. ఇటీవల అల్లు శిరీష్ తన ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. నైనికా అనే అమ్మాయిని ప్రేమించిన ఆయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిసి ఇదెప్పుడు జరిగిందని అంతా షాక్ అవుతున్నారు. ఇక ఇటీవల నారా రోహిత్ కూడా తనతో పని చేసిన సిరి లేల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో యంగ్ హీరో పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించి బిగ్ షాకిచ్చాడు.
అసలు విషయంలోకి వెళితే.. నేడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాను. నాకు మంచి సినిమాలు, మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకే తిరుమలకు వచ్చాను. కొత్త సంవత్సరం శ్రీవారి ఆశీస్సులతో ముందుకు సాగాలని కోరుకున్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను. త్వరలో ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో రాబోతున్నాను.
నాకు ఈ ప్రాజెక్ట్ హిట్ ఇస్తుందని నమ్మకం ఉంది’’ అని అన్నారు.ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా.. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ‘సంబరాల ఏటిగట్టు’ రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు.ఇది తేజ్ కెరీర్‌లో కీలక మలుపుగా మారనుంది. దీనిని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi)హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించినప్పటికీ షూటింగ్ పూర్తి కానందున రిలీజ్ వాయిదా పడింది.






