‘సఃకుటుంబానాం’ విజయం సాధించాలి.. ఈ వేడుకకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా: బుచ్చిబాబు

by Mallepaka Hamsa |

రామ్ చరణ్(Ram Charan), మేఘ ఆకాష్(Megha Akash) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉదయ్ శర్మ ‘సఃకుటుంబానాం’(sahkutumbanam).

‘సఃకుటుంబానాం’ విజయం సాధించాలి.. ఈ వేడుకకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా: బుచ్చిబాబు
X

దిశ, సినిమా: రామ్ చరణ్(Ram Charan), మేఘ ఆకాష్(Megha Akash) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉదయ్ శర్మ ‘సఃకుటుంబానాం’(sahkutumbanam). ఉదయ్ శర్మ దర్శకత్వంలో రాబోతుండగా.. హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నవిడుదల తేదీ దగ్గరవుతున్న సందర్భంగా ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సనా చేతుల మీదుగా ‘సఃకుటుంబానాం’ చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు.

ఇందులో బుచ్చిబాబు సనా మాట్లాడుతూ... " బ్రహ్మానందం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన నాన్నకు ప్రేమతో, ఆర్య 2 చిత్రాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఇప్పుడు వారి పక్కన నిలబడి డైరెక్టర్‌గా మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని నటీనటులకు, నిర్మాతకు, సాంకేతిక బృందానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్" చెప్పారు. అనంతరం.. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... "బ్రహ్మానందంతో మరోసారి కలిసి నటించడం సంతోషంగా ఉంది. సఃకుటుంబానాం వంటి కథ 48 సంవత్సరాలలో నేను ఎప్పుడూ వినలేదు, చేయలేదు. ఈ సినిమా అంత ప్రత్యేకంగా ఉండబోతుంది. నన్ను ఒక నటుడుగా తీర్చిదిద్దిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు.

ఆయన దగ్గర నేర్చుకున్న పని అందరికీ ఉపయోగపడటం గర్వించదగిన విషయం. సఃకుటుంబానాం వంటి సినిమాలో నాకు ఇచ్చిన పాత్ర చాలా ఛాలెంజ్ లు ఉన్నాయి. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది. ఇందులో హీరోగా నటించిన రామ్ కిరణ్ ఎంతో శ్రద్ధతో నేర్చుకుని నటించారు. నిర్మాత మహదేవ్ గౌడ్ గారు ఇటువంటి సినిమాలు మరిన్ని తీయాలని, తరువాత తరాలకు ఉపయోగపడే ఇటువంటి సినిమాలు మరిన్ని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సఃకుటుంబానాం చిత్రాన్ని అందరూ థియేటర్‌లో చూడాలని కోరుతున్నాను" అన్నారు.

Next Story