స్టార్ హీరోల కోసం త్యాగం! కెరీర్ రిస్క్ చేస్తున్న యంగ్ బ్యూటీస్.. ఫలితం దక్కుతుందా?

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-24 10:56:01  IST  )

నాని, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల కోసం ఈ భామలు ఇతర క్రేజీ అవకాశాలను సైతం వదులుకుంటున్నారట.

స్టార్ హీరోల కోసం త్యాగం! కెరీర్ రిస్క్ చేస్తున్న యంగ్ బ్యూటీస్.. ఫలితం దక్కుతుందా?
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు, అదృష్టంతో పాటు కొన్నిసార్లు సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా టాలీవుడ్‌లో ఇద్దరు యంగ్ బ్యూటీలు తమ కెరీర్ పరంగా భారీ రిస్క్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నాని, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల కోసం ఈ భామలు ఇతర క్రేజీ అవకాశాలను సైతం వదులుకుంటున్నారట. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’లో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే, ఈ సినిమా కోసం మేకర్స్ ఆమె నుంచి బల్క్ డేట్స్ కోరినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ షెడ్యూల్స్ చాలా పక్కాగా, సుదీర్ఘంగా ఉండబోతుండటంతో.. వేరే సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని భావించిన రుక్మిణి, తన వద్దకు వచ్చిన మరో 3, 4 పెద్ద ఆఫర్లను సున్నితంగా తిరస్కరించినట్లు టాక్. ఎన్టీఆర్ వంటి గ్లోబల్ స్టార్, ప్రశాంత్ నీల్ వంటి సెన్సేషనల్ డైరెక్టర్ సినిమా కాబట్టి, ఈ రిస్క్ చేస్తే తన కెరీర్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్తుందని ఆమె నమ్ముతోందట.

మరోవైపు, నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంలో కయ్యదు లోహర్ 'సుబ్బలక్ష్మి' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా, ఈ రెండో కాంబినేషన్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా కోసం కయ్యదు కూడా తన పూర్తి సమయాన్ని కేటాయిస్తోంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే, టాలీవుడ్‌లో ఆమె స్థానం సుస్థిరం అవుతుందని భావిస్తోంది. అందుకే ఇతర చిన్న సినిమాల వైపు చూడకుండా కేవలం ఈ ప్రాజెక్ట్ మీదనే తన ఫోకస్ పెట్టిందట. స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్ల సినిమాల కోసం వేరే అవకాశాలు వదులుకోవడం అనేది ఒక రకంగా రిస్క్ లాంటిదే. షూటింగ్ ఆలస్యమైతే కెరీర్ పరంగా గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంటుంది . కానీ, ఎన్టీఆర్, నాని సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ ఇద్దరు భామలు చేసిన రిస్క్ కచ్చితంగా ఫలిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ త్యాగానికి తగ్గ గుర్తింపు వారికి లభిస్తుందో లేదో తెలియాలంటే ఈ సినిమాలు విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే!

Next Story