- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్మికను వణికిస్తున్న ఆ అందాల తార.. ఒక్క హిట్టు పడితే ఇక ఆపడం కష్టమే!
రష్మికకు కొత్త టెన్షన్ మొదలైందని వార్తలు వస్తున్నాయి. రుక్మిణి వసంత్ కారణంగా రష్మికకు అవకాశాలు

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందాన్న పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. పుష్ప, యానిమల్ సినిమాలతో రష్మిక బ్రాండ్ అమాంతం పెరిగిపోయింది. అయితే.. అలాంటి హీరోయిన్ రష్మికకు కొత్త టెన్షన్ మొదలైందని వార్తలు వస్తున్నాయి. రుక్మిణి వసంత్ కారణంగా రష్మికకు అవకాశాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
కన్నడకు చెందిన రుక్మిణి వసంత్ ఇటీవలే నటించిన కాంతార చాప్టర్ 1 సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. దసరా రోజు రిలీజ్ అయిన కాంతార చాప్టర్ 1 తొలిరోజు 89 కోట్లవరకు రాబట్టిందని సమాచారం. ఇందులో రుక్మిణి వసంత్ పాత్ర అందరిని కట్టిపడేసిందట. దీంతో రుక్మిణి వసంత్ కు టాలీవుడ్ లో ఎక్కువగా అవకాశాలు వస్తాయని అంటున్నారు. గతంలో రష్మికకు ఇలాగే అవకాశాలు వచ్చాయి.
ఇప్పుడు ఆమె స్థానాన్ని రుక్మిణి వసంత్ భర్తీ చేస్తుందని టాలీవుడ్ సర్కిర్స్ లో వార్తలు వస్తున్నాయి. దానికి తోడు బాలీవుడ్ లో రష్మిక ఎక్కువగా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రుక్మిణి వసంత్ కు ఎక్కువ అవకాశాలు వచ్చే ఛాన్సులు ఉన్నాయని చెబుతున్నారు. డ్రాగన్ సినిమాలో రుక్మిణి వసంత్ కు అవకాశం రాగా, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోల సరసన ఛాన్సులు దక్కే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి ఈ మంచి అవకాశాన్ని రుక్మిణి వసంత్ ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.






