- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో క్రేజీ చాన్స్ దక్కించుకున్న రుక్మిణి వసంత్.. వైరల్‌గా మారిన పోస్ట్
ధర్మన్’ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. కన్నడ ఇండస్ట్రీలో ‘సప్త సాగరదాచే ఎల్లో’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి, ప్రస్తుతం తమిళ్, తెలుగు భాషల్లో బిజీగా మారిన క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్.

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్: ది డెడ్లీ డాక్టర్’. ఉలగనాయగన్ కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వథ్ మారిముత్తు తెరకెక్కిస్తున్నారు. రజినీకాంత్ కెరీర్‌లో 173వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. పోస్టర్‌లో రజినీకాంత్ చేతిలో సర్జికల్ బ్లేడ్ పట్టుకుని, రక్తంతో తడిసిన చేతులతో ఒక పవర్‌ఫుల్ డాక్టర్ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ లుక్ చూశాక సినిమా సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ఉండబోతోందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమాలో రాశీఖన్నా, యోగిబాబు, సీనియర్ నటి సిమ్రాన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా ‘ధర్మన్’ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. కన్నడ ఇండస్ట్రీలో ‘సప్త సాగరదాచే ఎల్లో’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి, ప్రస్తుతం తమిళ్, తెలుగు భాషల్లో బిజీగా మారిన క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు టాక్. కథను మలుపు తిప్పే ఒక ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసం దర్శకుడు అశ్వథ్ ఆమెను సంప్రదించారని, దానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రుక్మిణి వసంత్ తన క్యూట్ లుక్స్‌తో, అద్భుతమైన నటనతో సౌత్ ఇండియాలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించే అవకాశం దక్కించుకుందనే వార్త తెలియడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






