అదృష్టం అంటే ఈమెదే.. పాన్ ఇండియా సినిమాలో చాన్స్ కొట్టేసిన రుక్మిణి వసంత్!

by Mallepaka Hamsa |

రుక్మిణి టాలీవుడ్, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌లో భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అదృష్టం అంటే ఈమెదే.. పాన్ ఇండియా సినిమాలో చాన్స్ కొట్టేసిన రుక్మిణి వసంత్!
X

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు ఇప్పుడు సౌత్ ఇండియా అంతటా మారుమోగిపోతోంది. తన యాక్టింగ్‌తో కుర్రాళ్ల మనసు గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. కన్నడలో సత్తా చాటిన ఈ అమ్మడు, ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌లో భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకేసారి పాన్ ఇండియా రేంజ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం.. రుక్మిణి వసంత్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. ‘లబ్బర్ పందు’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.

ఈ భారీ చిత్రాన్ని ధనుష్ తన సొంత బ్యానర్ వండర్‌బార్ స్టూడియోస్, డాన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ పాన్ ఇండియా సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక రాబోతున్నట్లు టాక్. దీంతో పాటు తెలుగులో మెగా ప్రాజెక్ట్ అయిన ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమాలో రుక్మిణి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతోంది. అలాగే కన్నడ రాకింగ్ స్టార్ యష్ సరసన ‘టాక్సిక్’ అనే భారీ చిత్రంలోనూ నటిస్తోంది. జూన్ 4న ఈ సినిమా విడుదల కాబోతుండటంతో, రుక్మిణి క్రేజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా ఎన్టీఆర్, యష్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ రుక్మిణి వసంత్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అదృష్టం అంటే రుక్మిణిదే అని కామెంట్లు పెడుతున్నారు.

Next Story