- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 9.35 కోట్ల మోసం.. అషురెడ్డిపై పోలీసు కేసు నమోదు!
ధర్మేంద్ర ఇచ్చిన డబ్బుతో తన పేరు మీద ఆస్తులు రిజిస్టర్ చేయించుకోవడం. ఇలా మొత్తం కలిపి రూ. 9.35 కోట్ల మేర అషు రెడ్డి లబ్ధి పొందినట్లు బాధితులు ఆరోపణలు చేశారు.

దిశ, సినిమా: సోషల్ మీడియా స్టార్, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి చుట్టూ ఇప్పుడు ఒక భారీ వివాదం ముసురుకుంది. ఎప్పుడూ తన గ్లామరస్ ఫొటోలతో వార్తల్లో ఉండే ఈ భామ, ఇప్పుడు ఏకంగా రూ. 9.35 కోట్ల ఆర్థిక మోసం ఆరోపణలను ఎదుర్కొంటోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక యువకుడిని నిలువునా ముంచేసిందన్న వార్త ఇప్పుడు బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. బాధితుడి తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్రకు 2018లో అషు రెడ్డితో పరిచయం ఏర్పడిందట. అప్పట్లో తను అమెరికాలో చదువు పూర్తి చేసి, సినిమాల్లో రాణించాలనే లక్ష్యంతో ఉన్నానని చెప్పి ఆమె ధర్మేంద్రకు దగ్గరయ్యారు. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఇదే అదునుగా చేసుకున్న అషు రెడ్డి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తన ఆర్థిక అవసరాల కోసం ధర్మేంద్ర నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టిందట.
2018 నుంచి 2025 వరకు అంటే దాదాపు ఏడేళ్ల కాలంలో ఆమె రకరకాల సాకులు చెప్పి ధర్మేంద్ర నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం నగదు మాత్రమే కాకుండా.. దాదాపు 5 కిలోల బంగారం. ఖరీదైన ఫ్లాట్లు, వాహనాలు కూడా కొనుకున్నట్లు బాధితుడి కుటుంబం తెలిపింది. ధర్మేంద్ర ఇచ్చిన డబ్బుతో తన పేరు మీద ఆస్తులు రిజిస్టర్ చేయించుకోవడం. ఇలా మొత్తం కలిపి రూ. 9.35 కోట్ల మేర అషు రెడ్డి లబ్ధి పొందినట్లు బాధితులు ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఆమె సోదరి కూడా సుమారు రూ. 50 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి ఖాయం చేసుకునేందుకు అషు రెడ్డి కుటుంబం పూజలు కూడా నిర్వహించిందని, కానీ చివరకు పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేసిందని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది. మోసపోయామని గ్రహించిన బాధితుడు సీసీఎస్ (CCS) పోలీసులను ఆశ్రయించగా, అషురెడ్డి కుటుంబంపై వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారం టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఎప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడిపే అషు రెడ్డిపై వచ్చిన ఈ ఆరోపణలపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.






