జపాన్‌లో 200 డేస్ కంప్లీట్ చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’

by Disha Web Desk 10 |
జపాన్‌లో 200 డేస్ కంప్లీట్ చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా, దర్శక శిఖరం ఎస్ఎస్ రాజమౌళి తెరక్కెకించిన ‘RRR’ మూవీ.. రికార్డ్ బద్దలుకొట్టే స్థాయిలో కలెక్షన్స్ సంపాదించింది. ఆస్కార్ గెలుపొంది చరిత్ర సృష్టించింది. ఇక మన దేశంలో ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్‌లో ఆడనప్పటికీ.. పక్కదేశాల్లో మాత్రం ఇంకా హవా కోనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే జపాన్‌లో ఏకంగా 102 స్క్రీన్స్‌లో 200 రోజుల రన్‌ కంప్లీట్ చేసుకుని అరుదైన రికార్డు నమోదు చేసింది. అలాగే 1 లక్ష 48 వేల మంది మూవీని వీక్షించడం విశేషం. కాగా తమ చిత్రంపై ఇంత ప్రేమను కురిపిస్తున్న ప్రేక్షకులకు మూవీ యూనిట్ థాంక్స్ చెప్పింది.

Next Story

Most Viewed