యుద్ధానికి సిద్ధమైన రోషన్ కనకాల.. అంచనాలను పెంచుతున్న ‘మోగ్లీ’ ట్రైలర్..

by Mallepaka Hamsa |

యంగ్ హీరో రోషన్ కనకాల (Roshan Kanakala)తన రెండో చిత్రం ‘మోగ్లీ’(Mowgli) 2025లో పూర్తిగా డిఫరెంట్ అవతార్‌లో కనిపించనున్నారు.

యుద్ధానికి సిద్ధమైన రోషన్ కనకాల.. అంచనాలను పెంచుతున్న ‘మోగ్లీ’ ట్రైలర్..
X

దిశ, సినిమా: యంగ్ హీరో రోషన్ కనకాల (Roshan Kanakala)తన రెండో చిత్రం ‘మోగ్లీ’(Mowgli) 2025లో పూర్తిగా డిఫరెంట్ అవతార్‌లో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్(Sandeep Raj) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ‘మోగ్లీ’ ఇప్పటికే బలమైన బజ్ సృష్టించింది. ఈరోజు, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇక ట్రైలర్‌లో విలన్ పాత్రను పోషించిన బండి సరోజ్ కుమార్ పరిచయంతో ప్రారంభమవుతుంది. కథనం మోగ్లీ ప్రశాంతమైన ప్రపంచానికి మారుతుంది. అతని గర్ల్ ఫ్రెండ్, చెవిటి-మూగ డ్యాన్సర్, అడవిలో షూటింగ్ చేస్తున్న ఫిల్మ్ యూనిట్‌లో భాగం. దర్శకుడు ఆమెతో ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ‘మోగ్లీ’ వార్నింగ్ ఇస్తాడు. సరోజ్ కుమార్ ఆ ప్రాంతంలో పోస్టింగ్ కావడం, ఆ అమ్మాయి పట్ల అతనికి ఉన్న ఆసక్తితో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి.

ఆమెను రక్షించాలని నిశ్చయించుకున్న మోగ్లీ యుద్ధానికి సిద్ధమవుతాడు. తన తొలి సినిమా కలర్ ఫోటోతో మనసుని ఆకట్టుకునే ప్రేమకథలను రూపొందించడంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన దర్శకుడు సందీప్ రాజ్, ఈసారి చాలా పెద్ద కాన్వాస్‌పై అదరగొట్టారు. చెవిటి-మూగ హీరోయిన్, అసాధారణ కథానాయకుడు, రామాయణ శైలి కథనం ఈ చిత్రానికి ప్రత్యేకతని జోడించింది. రోషన్ కనకాల మోగ్లీగా పాత్రలో అదరగొట్టారు. ఈ పాత్ర కోసం కంప్లీట్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. సాక్షి మడోల్కర్ సవాలుతో కూడిన పాత్రను పోషించారు. బండి సరోజ్ కుమార్ విలన్‌గా అద్భుతంగా నటించారు. అతని శక్తివంతమైన విలన్ పాత్ర కథలో హీరోయిజాన్ని పెంచుతుంది. హర్ష చెముడు తనదైన ముద్ర వేశాడు. డిసెంబర్ 12న విడుదల కానున్న మోగ్లీ 2025 ట్రైలర్‌తో అంచనాలని భారీగా పెంచింది.

Next Story