నెలరోజులకే ఓటీటీలోకి రాబోతున్న రొమాంటిక్ మూవీ.. అధికారిక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-22 15:30:00  IST  )

యంగ్ హీరో నరేష్ అగస్త్య (Naresh Agastya) మత్తు వదలరా, వికటకవి, పంచతంత్ర వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు.

నెలరోజులకే ఓటీటీలోకి రాబోతున్న రొమాంటిక్ మూవీ.. అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: యంగ్ హీరో నరేష్ అగస్త్య (Naresh Agastya) మత్తు వదలరా, వికటకవి, పంచతంత్ర వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక ఇటీవల ఆయన ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ (Meghalu Cheppina Prema Katha)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రబియా ఖాతూన్(Rabiah Khatun) హీరోయిన్‌గా నటించగా.. విపిన్ దర్శకత్వంలో వచ్చింది. ఉమాదేవి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 22న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ హిట్ అందుకోలేకపోయింది. తాజాగా, ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ప్రముఖ సంస్థ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. ఈ సినిమా సన్‌నెక్ట్స్‌లో సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘‘రెండు ప్రపంచాలు.. ఒక బంధం. వారిద్దరూ కలిసి గొప్పదాన్ని కనుగొంటారు. వారి ప్రయాణాన్ని మీకు చూపిస్తుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు.

link

Next Story