కార్తీక్ ఆర్యన్‌తో ప్రేమ.. లవ్ సింబల్‌తో హింట్ ఇస్తూ పోస్ట్ పెట్టిన శ్రీలీల!

by Mallepaka Hamsa |

కార్తీక్ ఆర్యన్ పెట్టిన ఈ బర్త్‌డే పోస్ట్‌కు శ్రీలీల థాంక్యూ స్వీటెస్ట్ అని రిప్లై ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఆ మెసేజ్‌కు ఒక లవ్ సింబల్ ను కూడా జోడించడంతో ప్రేమపై హింట్ ఇచ్చిందని అంతా అనుకుంటున్నారు.

కార్తీక్ ఆర్యన్‌తో ప్రేమ.. లవ్ సింబల్‌తో హింట్ ఇస్తూ పోస్ట్ పెట్టిన శ్రీలీల!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ విషయంపై వీరిద్దరు ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా స్పందించనప్పటికీ, తాజాగా జరిగిన ఒక సంఘటన వీరి ప్రేమ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. శ్రీలీల పుట్టినరోజును పురస్కరించుకుని కార్తీక్ ఆర్యన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఇంట్రెస్టింగ్ ఫొటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే శ్రీ శ్రీ అంటూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫొటోలో కార్తీక్ బైక్ నడుపుతుండగా, వెనుక కూర్చున్న శ్రీలీల బైక్ రియర్ వ్యూ మిర్రర్‌లో చూసుకుంటూ క్యూట్‌గా చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ రేర్ పిక్ చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. అయితే, అసలు కథ ఇక్కడే మొదలైంది.

కార్తీక్ ఆర్యన్ పెట్టిన ఈ బర్త్‌డే పోస్ట్‌కు శ్రీలీల స్పందిస్తూ.. థాంక్యూ స్వీటెస్ట్ అని రిప్లై ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఆ మెసేజ్‌కు ఒక లవ్ సింబల్ ను కూడా జోడించడంతో ప్రేమపై హింట్ ఇచ్చిందని అంతా అనుకుంటున్నారు. వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదు, అంతకుమించి ఏదో ఉందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ నిజమేనంటూ సోషల్ మీడియాలో వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. కాగా.. వీరిద్దరి కాంబోలో ఓ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా రాబోతుంది. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని భూషన్ కుమార్, క్రిషన్ కుమార్ టీ-సిరీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రీతమ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారు.

Next Story