మీ నాలుకలు కోస్తారు జాగ్రత్త: అమర్‌నాథ్‌కు ఎంపీ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-15 11:53:54  IST  )

హోంమంత్రి వంగలపూడి అనితను మేకప్ మంత్రి అంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అమర్‌నాథ్‌పై ఎంపీ బైరెడ్డి శబరి మండిపడ్డారు. గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని ఆమె వ్యాఖ్యానించారు.

మీ నాలుకలు కోస్తారు జాగ్రత్త: అమర్‌నాథ్‌కు ఎంపీ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha)ను ‘మేకప్ మంత్రి’ అంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అమర్‌నాథ్‌(Former Minister Amarnath)పై ఎంపీ బైరెడ్డి శబరి(MP Byreddy Shabari) మండిపడ్డారు. గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలపై నోటికి ఏది వస్తే అది మాట్లాడటంవైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. మాటలు అదుపులో పెట్టుకోకపోతే మహిళలు తమ నాలుకలు కోస్తారని, జాగ్రత్తగా ఉండాలని ఎంపీ హెచ్చరించారు.

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి

మహిళలపై మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేని పక్షంలో ఊరుకునేది లేదని బైరెడ్డి శబరి హెచ్చరించారు. ఐదేళ్లు అధికారం ఉండి రాష్ట్రానికి ఒక్క సంస్థను కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. హోంమంత్రిపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై కేసులు పెడతామని హెచ్చరించారు. అమర్‌నాథ్‌కు భార్య, పిల్లలు లేరా అని శబరి ప్రశ్నించారు. మహిళలపై మాట్లాడేటప్పుడు వైసీపీ నాయకులు ఆలోచించి మాట్లాడాలన్నారు. మహిళల జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తేలేదని ఎంపీ శబరి హెచ్చరించారు.

Next Story