‘Rocky Aur Rani Kii PremKahaani’ ఆలియా భట్ సినిమా రిలీజ్ కాకముందే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది?

by Disha Web Desk 6 |
‘Rocky Aur Rani Kii PremKahaani’ ఆలియా భట్ సినిమా రిలీజ్ కాకముందే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది?
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమకథలు తెరకెక్కించడంలో కెరాఫ్ అడ్రస్‌గా కరణ్ జోహార్ ఓ ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్ కలిసి నటిస్తున్న ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్‌ కహాని’చిత్రానికి కరణ్ డెరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది.

ఈ సినిమా జూలై 28న థియేటర్స్‌లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు రివ్యూ ఇస్తూ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్‌ కహాని సినిమా రచన అభినయం ఉన్న చిత్రం. ఇది సెన్సార్ రూల్స్ ను పాటించదు అదే వారికి పెద్ద బలం. మంచి శైలిని కలిగి ఉండి పలు సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆలియా భట్ షో దొంగిలించింది’’ అంటూ రాసుకొచ్చాడు. అది చూసిన నెటిజన్లు సినిమా విడుదల కాకముందే పాజిటివ్ రివ్యూ ఇచ్చావంటే ఫ్లాప్ అవుతుందనిపిస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :: దేవాలయంలో దర్శనం చేసుకున్నా అంటూ Om Raut పోస్ట్.. ఇంకా బతికే ఉన్నావా అంటూ నెటిజన్లు ఫైర్

Next Story

Most Viewed