Karthik Aryan :: అరుదైన గౌరవం దక్కించుకున్న బాలీవుడ్ హీరో.. ‘ఐఎఫ్ఎఫ్ఎం’ అవార్డుకు ఎంపిక

by Dishanational2 |
Karthik Aryan :: అరుదైన గౌరవం దక్కించుకున్న బాలీవుడ్ హీరో.. ‘ఐఎఫ్ఎఫ్ఎం’ అవార్డుకు ఎంపిక
X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో కార్తిక్‌ ఆర్యన్‌ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ఈ మేరకు గడిచిన రెండేళ్లలో నటుడిగా అత్యంత ప్రజాధారణ పొందినందుకుగానూ ‘ఐఎఫ్ఎఫ్ఎం’ అవార్డు అందుకోనున్నాడు. ఆగస్టు 11న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో పద్నాలుగోవ ‘ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’ (ఐఎఫ్ఎఫ్ఎం) వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇండియన్ నటుడు కార్తిక్ ఆర్యన్‌కు ‘రైజింగ్ గ్లోబల్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అవార్డును అందించబోతున్నట్లు సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇటీవల వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలవడంతోపాటు, పలు వేడుకల్లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు కార్తిక్. అంతేకాదు స్టార్ హీరోయిన్లతోనూ నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్నందుకు ఈ అవార్డు అందిస్తున్నట్లు ఐఎఫ్ఎఫ్‌ఎం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి :: Surya ‘Kanguva’పై పెరుగుతున్న అంచనాలు.. మూడు భాగాలుగా రానుందట



Next Story

Most Viewed