‘కాంతార: చాప్టర్1’ షూటింగ్ సమయంలో నాకు నేను పరిమితులు విధించుకున్నా.. రిషబ్ శెట్టి షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి(Rishabh Shetty) ‘కాంతార: చాప్టర్1’ (Kantara: Chapter 1)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

‘కాంతార: చాప్టర్1’ షూటింగ్ సమయంలో నాకు నేను పరిమితులు విధించుకున్నా.. రిషబ్ శెట్టి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి(Rishabh Shetty) ‘కాంతార: చాప్టర్1’ (Kantara: Chapter 1)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న విజయదశమి నాడు థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్న రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నేను ఈ సినిమాలో దేవుడికి సంబంధించిన సన్నివేశాలు తీస్తున్న సమయంలో నాకు నేను నియమాలు పెట్టుకున్నాను. మాంసాహారం తీసుకోలేదు. అలాగే చెప్పులు కూడా వేసుకోకుండా నడిచాను. నేను భగవంతుడిని బాగా నమ్ముతాను అందుకే ఆ సన్నివేశాలు తెరకెక్కించే సమయంలో నాకు నేను పరిమితులు విధించుకున్నా.

నేను ఇతరుల నమ్మకాల గురించి మాట్లాడను. ఎవరి నమ్మకం వారిది కాబట్టి అందరూ నాలాగే ఉండాలని నేను అనుకోను. ఈ చిత్రంలో కొన్ని సీన్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ముఖ్యంగా ఒక సన్నివేశం జీవితాంతం గుర్తుంటుంది. కచ్చితంగా నేను గుర్తుకు వస్తాను. అన్ని భాషల్లోని ప్రేక్షకులు ఆ సీన్ గురించి మాట్లాడుకుంటారనే నమ్మకం నాకు ఉంది. కాంతార తర్వాత నా జీవితం మారిపోయింది. ప్రేక్షకుల చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని ఎమోషనల్ అయ్యారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లకు ‘కాంతార చాప్టర్1’ పై అంచనాలు పెరిగిపోయాయి. కాగా.. ఈ సినిమా రిషబ్ శెట్టి స్వయం దర్శకత్వంలో రాబోతుంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రాబోతుండటం విశేషం.

Next Story