- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kantara Chapter 1 Box Office Collection : 9 రోజుల్లో ‘కాంతార:చాప్టర్1’ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రిషబ్ శెట్టి(Rishabh Shetty) స్వయం దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కాంతార:చాప్టర్1’(Kantara: Chapter 1).

దిశ, సినిమా: రిషబ్ శెట్టి(Rishabh Shetty) స్వయం దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కాంతార:చాప్టర్1’(Kantara: Chapter 1). ఈ సినిమా విజయదశమి నాడు విడుదలై ఘన విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తూ.. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతోంది. పలు రికార్డులు క్రియేట్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. తాజాగా, ‘కాంతార:చాప్టర్1’ అత్యధిక వసూళ్లు సాధించింది. బాక్సాఫీసు వద్ద 9 రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్‌లో స్థానం సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. చిత్రబృందం ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. Kantara: Chapter 1' worldwide box office
వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ. 509 కోట్లు సాధించినట్లు వెల్లడించారు. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ఈ ఏడాదిలో విడుదలైన ‘ఛావా’ రూ. 600 కోట్లు సాధించి అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల వరుసలో మొదటి స్థానం దక్కించుకుంది. త్వరలోనే ‘కాంతార: చాప్టర్1’ మొదటి స్థానంలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సినీ ప్రియులు భిప్రాయపడుతున్నారు. కాగా.. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఇందులో అమ్మడు నటన కూడా ఓ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.






