- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kantara: Chapter 1: వివాదంపై స్పందించిన రిషబ్ శెట్టి.. తప్పుగా అర్థం చేసుకోవద్దంటూ కామెంట్స్
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty)స్వయం దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కాంతార:చాప్టర్1’(Kantara: Chapter 1).

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty)స్వయం దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కాంతార:చాప్టర్1’(Kantara: Chapter 1). ఈ సినిమా రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘కాంతార’కు సీక్వెల్‌గా రాబోతుంది. ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో.. మూవీ మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇక ఇందులో పాల్గొన్న రిషబ్ శెట్టి తెలుగు మాట్లాడకపోవడంతో పలు విమర్శలు చేశారు. తెలుగు సినిమాలను కన్నడిగులు అడ్డుకున్న విషయం తెలిసిందే.
అలాగే రిషబ్ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ భాష మాట్లాడుతారు. కానీ హైదరాబాద్‌కి వచ్చి తెలుగు మాట్లాడకపోవడమేంటని యూత్ మండిపడుతున్నారు. అంతేకాకుండా ‘కాంతార:చాప్టర్1’ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, రిషబ్ శెట్టి ఈ వివాదంపై స్పందించారు. విజయవాడలో జరిగిన ఈవెంట్‌లో పూర్తిగా.. తెలుగు స్పీచ్‌తోఅందరినీ షాక్‌కు గురి చేశారు. ‘‘నాకు ఇంత ప్రేమ ఇచ్చినందుకు, ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ‘కాంతార’ విడుదలై ఇది మూడవ సంవత్సరం.
2022లో ఇదే రోజున ‘కాంతార’మీ ముందుకు వచ్చి హిట్ అయింది. ఇప్పుడు అక్టోబర్ 2న ‘కాంతార: చాప్టర్1’ రాబోతుంది. అంతే హిట్ ఇస్తారని ఆశిస్తున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి. నాకంత తెలుగు రాదు. నేను మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ‘జైహనుమాన్’చేస్తున్నాను. ఆ సినిమా ఈవెంట్‌కి వచ్చినప్పుడు కచ్చితంగా తెలుగు నేర్చుకొని మాట్లాడతాను.హైదరాబాదులో జరిగిన ఈవెంట్‌లో కూడా మాట్లాడాలని అనుకున్నా.. కానీ కుదరలేదు. భాషపై నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి’’ అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు షాక్ అవుతుంటే.. మరికొందరు మాత్రం ఈ బుద్ధి ఏదో ముందే ఉంటే బాగుండేదిగా? అని కామెంట్లు పెడుతున్నారు.






