- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కాంతార: చాప్టర్1’ సినిమా వల్ల చనిపోయేవాడిని.. షాకింగ్ విషయాన్ని రివీల్ చేసిన రిషబ్ శెట్టి
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishabh Shetty)నటిస్తున్న అత్యంత భారీ ప్రాజెక్ట్ ‘కాంతార: చాప్టర్ 1’(Kantara: Chapter 1).

దిశ, సినిమా: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishabh Shetty)నటిస్తున్న అత్యంత భారీ ప్రాజెక్ట్ ‘కాంతార: చాప్టర్ 1’(Kantara: Chapter 1). ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రాబోతుంది. ఇందులో రుక్మిని వసంత్ (Rukmini Vasanth)హీరోయిన్‌గా నటించగా.. జయరామ్ గుల్షన్ దేవియ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తెలుగులో ప్రభాస్ లాంచ్ చేయగా.. హీందీలో హృతిక్ రోషన్, తమిళంలో శివ కార్తికేయన్ రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న రిషబ్ శెట్టి షాకింగ్ విషయాన్ని తెలిపాడు.
‘‘కాంతార: చాప్టర్1 సినిమా షూటింగ్ సమయంలో నాకు సెట్‌లో4-5 సార్లు చనిపోయేవాడిని. నాకు అప్పుడు అనేక ప్రమాదాలు జరిగాయి. అనుకోకుండా నేను చావు అంచుల వరకు వెళ్లి వచ్చాను. సినిమా యూనిట్ సభ్యలు అనుకోకుండా మరణించడం కూడా జరిగింది. ఈ పరిస్థితులు చుట్టూ వారిని నిరాశలో నెట్టాయి. అయినప్పటికీ అన్ని సవాళ్లను ఎదుర్కొని సినిమాను సమయానికి పూర్తి చేయడానికి అందరూ కృషి చేశారు. మేము మూడు నెలలుగా నిద్రలేని రాత్రులు గడిపాము. ప్రతి ఒక్కరూ ‘కాంతార: చాప్టర్1’ కోసం చాలా కష్టపడ్డారు. సెట్‌లో ఎదురైన ప్రమాదాల మధ్య, దైవత్వం మాకు రక్షణగా నిలిచింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆయన డెడికేషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.






