Rishab Shetty: రాజమౌళితో పోటీకి సిద్ధమే నంటున్న కాంతారా హీరో రిషబ్ శెట్టి

by Disha Web Desk 10 |
Rishab Shetty: రాజమౌళితో  పోటీకి సిద్ధమే నంటున్న కాంతారా హీరో రిషబ్ శెట్టి
X

దిశ, వెబ్ డెస్క్ : కాంతారా విడుదలైనప్పుడు ఆ సినిమా పై ఎవరు పెద్దగా ఆసక్తి చూపలేదు. కాంతార 2 కూడా ఉందనగానే అందరి చూపు ఆ సినిమా పైనే ఉంది. ఎంతలా అంటే సినిమా విడుదలైతే పనులన్ని మానుకొని సినిమా థియోటర్ కి వెళ్లి కూర్చొని చూసేలా ఉన్నారు జనాలు. అంతలా మన తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా పాన్ ఇండియా అభిమానులను కూడా కాంతార సినిమా ఇంప్రెస్ చేసింది. మహేష్ ,రాజమౌళి సినిమాలకి పోటీగా తయారవుతుంది.

కన్నడలో ఈ సినిమా 6 కోట్లతో తెరకెక్కిన కాంతార 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టికి స్టార్ డమ్ తీసుకొచ్చింది. బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ సినిమా పార్ట్ 2 తీయడానికి రిషబ్ కథ రెడీ చేసుకుంటున్నాడు. అయితే ఇది సీక్వెల్ కాకుండా మొదటి పార్ట్ ఎక్కడ మొదలు అయిందో దానికి ముందు జరిగిన సంగటనల ఆధారంగా కాంతార2 ఉంటుందట. ఈ క్రమంలో దేవుడికి సంబందించిన సీన్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది.

ఈ సినిమాను 2024 లో విడుదల చేస్తామని రిషబ్ తెలిపారు. కాంతార సినిమాని పాన్ ఇండియాగా విడుదల చేస్తే కాంతార 2 పాన్ వరల్డ్‌గా విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారట. తెలుగు,హిందీ అభిమానులకు తెలియని పంజూరి కథ అందరిని ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే కాంతారను త్వరలో స్పానిష్ , ఇటాలియన్ భాషలో విడుదల చేయనున్నారు. పార్ట్ 2 లో హాట్ బ్యూటీ ఊర్వశి చోటు దక్కించుకుంది .

Also Read...

Tollywood: రవితేజ, నాని ఒకే చోట ఉంటే ఆ కిక్కే వేరబ్బా!

Next Story

Most Viewed