- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కాంతార చాప్టర్-1’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి.. మోత మోగిపోవాల్సిందే అంటూ ట్వీట్
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty), రుక్మిణి వసంత్(Rukmini Vasanth) జంటగా నటిస్తున్న సినిమా ‘కాంతార చాప్టర్-1’(Kantara Chapter-1).

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty), రుక్మిణి వసంత్(Rukmini Vasanth) జంటగా నటిస్తున్న సినిమా ‘కాంతార చాప్టర్-1’(Kantara Chapter-1). ఈ చిత్రం ‘కాంతార’ ప్రీక్వెల్‌గా తెరకెక్కుతుండగా.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిషబ్ శెట్టి స్వయం దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. ఈ మూవీని హోంబలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్‌తో హైప్ పెంచుతున్నారు.
ఇక ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. ‘కాంతార’ అత్యంత ముఖ్యమైన అప్డేట్ రాబోతున్నట్లు రిషబ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12: 45 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే జనాలంతా మంటలు పట్టుకుని అతని దగ్గరకు వస్తుండగా.. రిషబ్ డబ్బుకొడుతున్నట్లుగా ఉన్న పవర్ ఫుల్ పోస్టర్‌తో ఈ సారి మోత మోగిపోవాల్సిందే అని పోస్ట్ ద్వారా తెలిపాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న రిషబ్ అభిమానులు ఆనందపడుతున్నారు.






